మరు మాట యొచించకే, ఒడి లోన నిదురించవే, కనుపాపలా నువ్వు మారితే, కను రెప్పై నేనవ్వనా, మధురాతి మధురం నువ్వు చేరే సమయం, తుద లేని గమనం నీతో సాగే పయనం, విడదీయు దూరలే జడి వానలా చేరితే, సడి చెయ్యని కన్నీరే కడలల్లే నను ముంచదా, మరువనుగ నేనిన్నే నువ్వు లేక నే లేనులె, తనువిడిచినా నేను నా ప్రేమ మరుగవ్వదే.... తడి ఆరని స్వేదాలు, గది దాటని వివరాలు, అలుపెరుగక సాగే పరువం,ఏనాటికైనా మరువం, కదిలేటి గడియారం, పలికిందొక మర్మం, పెనవేసిన అధరాలకు, చాలంది దాహం, నీ జ్ఞాపకం వరం, అది ఆపుటెవరం తరం, మొదలైన తుద అయినా నీవే నా సర్వస్వం.. పలు మార్లు మరణించినా , మరుమారు జన్మించనా, నీ ప్రేమ కొరకై మగువా,ఏ భారమైనా బరువా? హ్రుదయానికి ఎద గానం నీ పేరే తెలుసా? ఉదయానికి తొలి కిరణం నీ చూపే బహుశా!! పిడి వాదం వదిలి,దరి చేరవే చెలి, విసిరే దరహాసం, ముసిరే మధుమాసం.....
వేకువ వెలుగులు తొడిగి వికసించె, మాపటి కలలే నిన్నే వెలిగించె, వదిలెయ్యి నిదుర,అడుగెయ్యి పదర.. నీ రాక కొసమే వేచింది లోకం.. రూపు రేఖలు లేని మనసంట, ఊపిరి ఆపుకొలేని మనమంత, నీ మనసు మెరుపు, నీ ఒంటి విరుపు కలగలిసి కదిలితే నీదేలే గెలుపు
Who are you? ప్రశాంత విశ్వంలో అలజడి రేపే సూక్ష్మం నువ్వా, ప్రభాత సూర్యంలో వెలుగును నింపే సూత్రం నువ్వా, Who are you? అనంత కాలానికి అంతాన ఉన్న ఆరక్షణమే నువ్వా, అమేయ శూన్యానికి ఆఖరున ఉన్న సరిహద్దు నువ్వా...
నా గుప్పెడు గుండెని తక్కెడ వేస్తే లెక్కే తేలని బరువు తూగింది, నీ చప్పుడు చేయని కన్నులు చూస్తే రెక్కలు తొడిగి అది పైకి ఎగిరింధి, నీ అడుగులు వెంట నేను పరుగెడుతుంటే, నా నీడే నన్ను దాటి,నీ వైపుకి లాగుతున్నది, ఈ మిణుగుకు మంట నీ చూపుల మాయే, నా ఊపిరి సైతం మారి, నీ ఊహలకు రూపమైంది.....