క్షుద్రం నేనే,రుద్రం నేనే
శౌర్యం నేనే, శాంతం నేనే
వేగం నేనే,వేదం నేనే,
వేషం నేనే,ఆవేశం నేనే,
గరళం నేనే,సరళం నేనే,
వలయం నేనే,విలయం నేనే,
సంద్రం నేనే,చంద్రం నేనే
క్షణక్షణం లోకం తీరునుబట్టి రూపం మార్చే మనిషిని నేనే,,
అంతానికి అనంతానికి నడుమ నడకలు నేర్చుకుంటున్న నరుడిని నేనే.....
No comments:
Post a Comment