Tuesday, January 7, 2020

My lyrics to Maruvaarthai song

మరు మాట యొచించకే, ఒడి లోన నిదురించవే,
కనుపాపలా నువ్వు మారితే, కను రెప్పై నేనవ్వనా, 
మధురాతి మధురం నువ్వు చేరే సమయం,
తుద లేని గమనం నీతో సాగే పయనం,
విడదీయు దూరలే జడి వానలా చేరితే,
సడి చెయ్యని కన్నీరే కడలల్లే నను ముంచదా,
మరువనుగ నేనిన్నే నువ్వు లేక నే లేనులె,
తనువిడిచినా నేను నా ప్రేమ మరుగవ్వదే....

తడి ఆరని స్వేదాలు, గది దాటని వివరాలు,
అలుపెరుగక సాగే పరువం,ఏనాటికైనా మరువం,
కదిలేటి గడియారం, పలికిందొక మర్మం,
పెనవేసిన అధరాలకు, చాలంది దాహం,
నీ జ్ఞాపకం వరం, అది ఆపుటెవరం తరం,
మొదలైన తుద అయినా నీవే నా సర్వస్వం..

పలు మార్లు మరణించినా , మరుమారు జన్మించనా,
నీ ప్రేమ కొరకై మగువా,ఏ భారమైనా బరువా?
హ్రుదయానికి ఎద గానం నీ పేరే తెలుసా?
ఉదయానికి తొలి కిరణం నీ చూపే బహుశా!!
పిడి వాదం వదిలి,దరి చేరవే చెలి,
విసిరే దరహాసం, ముసిరే మధుమాసం..... 





No comments: