ఏమిటిది కొత్త వరస నీకిది నా లోని మనసా,
ఏమైందో నీకు తెలుసా ప్రేమంటే ఇదేనా బహుశా,
నా కళ్ళలోన కొత్త రూపం ఏదో కదలాడింది,
ఆ రూపం నా మనసున దీపమై వెలిగింది,
చెలి చినుకై నను చేరగా తొలివలపే నను మీటేనే,
అలలేగిసే తొలిప్రేమ లో మునిగానే తొలిసారిగా..
వెన్నెల లోని వెలుగులు ఏవో నా కన్నుల్లో చేరాయి నిన్ను చూస్తుంటే,
పువ్వుల లోనే పరిమళం ఏదో నన్నే చేరుకుంటుంది నువ్వు వస్తుంటే,
విరహాన వేగుతున్న నీ తోడు లేక సఖియా,
ఉదయించు రవికిరణమై నను చేరవా చెలి...
3 comments:
very good
thanks a lot vinay..
A fantastic write filled with emotions... soo well expressed... very well done...
Post a Comment