Full falsu full falsu నీ బాష నీ వేషం..
మెలివేసి నాలుకనే.. మాటలతో మోసం చేశావ్ లేరా..
మాటల్లొ వలలున్నాయి ,వలలన్ని వేటాడాయి..
వేటాడి వెంటాడి చిక్కులను అక్కునకు చేర్చును లేర..
నమ్మకమే కొంచెం.. నాటకమే అచ్చం..
ఇది కాదా లోకం మొత్తం సోకిన ఒక రొగం..
ఒక పక్కన నీ స్వార్ధం.. ఒక పక్కన నీ భోగం..
కలగలసి నిన్ను చేరి అంచలంచలుగ పెంచెను లౌక్యం...
ప్రేమ, జాలి రెండు అర్ధం లేనివి కదరా...
ధనం మేఘం ఎక్కి,వేగం పెంచెను లోకం...
చుక్కలు చేరమంది నీలొ ఊహల ఉల్లాసం.
పక్కున నవ్వింది నీతో నడిచే యదార్థం..
నమ్మిన సిద్దాతం నిన్నే వంచన చేస్తుంది...
కమ్మని నీ అంతం కాటికి కూడా రానంది..
కవ్వించే కలలు.. నవ్వించే నిజాలు..
ఇది కాదా లోకం మొత్తం కొనసాగే నాటకం..
నీ చూపులకి చెమ్మ పొర..
నీ రేపటకి నవ్వు చెర..
మచ్చలెని స్నేహాలు..
మరువలేని మంచి పనులు..
ఖచ్చితంగా నీవి కాదు.. నువ్వు స్వచ్చమైన మనిషి కాదు...
మాటలతో ఆరంభం ఇక మౌనమేగా దాని అంతం...
ఆశకి హద్దు లేదుర.. నీ మాటలు అదుపు దాటెర..
మోసం మత్తులోనరా.. నీ బాటలు తప్పుగా మారెర. .
4 comments:
Beautifully told about the Fake philosphy..
Keep it up raaa..
awfully researched da fake world n aptly put in words..great
Really ! Thought provoking n satirical wording on modern day man...so expressive......
Post a Comment