కరిగి పోయే కాలం కాస్తా ఆగిపోయి నిన్నే చూపెనులె,
మరిచి పోయి గతాన్ని నేనే నీ తోడులో మైమరచా..
ఇది కలయో,ఇది వలయో నా నీడ నన్నే వీడేనే...
ఈ మమతే ఓ వనితా నా దరికె ఎన్నడు చేరలే..
నను నేనే అసలే ఎరగలే.. అణువనువున నువ్వే చేరగా...
నా చుట్టూ ఏదో కొత్త లోకం చేరుకుందీలె...
నా చెంత స్వర్గం చేరి,నీ రూపమే కనిపిస్తుంధే...
ఉన్నంత బాధను కాస్త నీ చూపే కడిగేస్తుంధే
నాదంటూ ఏమీ లేదే,నా కధగా నువ్వు మారక..
ఏమన్నా నీ పేరునే పలికనే అనుక్షణం...
గుండెలోన ఈ కలవరం, నేను పొందిన తొలివరం..
మొదలయ్యే.. మొదలయ్యే నాటకం...
నేను చూసిన అద్బుతాం.. నన్ను చేరిన ఒక హితం..
వదలదె.. వదలదె.. జ్ఞాపకం..
ఏ అన్నులో లేని ఈ వన్నెలే చూసి..
నా గుండె గువ్‌వై నీ వెంటే ఎగిరెనే.....
ఎన్నాలకో, ఎన్నెళ్లకో నా పైన కురిసే ప్రేమలే...
నీ నవ్వు నాపై కురవంగా...
కన్నీళ్లకే, కొన్నాళ్లుగా నా జాడ అసలే తెలియదే..
నీ ఊసులే నా చుట్టూ చేరంగా...
నా లోని ఈ భారం కోరింది నీ తీరం..
నా మది దాటనీ ఈ దూర సాగరం......
2 comments:
Wow Bappi.. Who is ur inspiration to write such beautiful lines??? :)
Ohh hooo inta matter unda sir ji meeku???nyway superb lines....
Post a Comment