అందమైన ఈ లోకం ఒక అద్భుతం...
అసలు అర్ధం కాని ఒక భూతం..
ఈ విచిత్ర ప్రపంచం లో నేనొక అనాధ చిత్రం..
నేను ఎరుగని నాతో, నాకు తెలియని నా కర్తవ్యం తో జీవిస్తున్నాను...
భువి చేరిన ఆకాశం లా నా చుట్టూ అవకాశం,
దక్కింకునే ఆవేశం నాలో చాలా ఉన్నా..
నాకు మాత్రం ఆది ఎప్పటికీ అందని ఆకాసమే
ఈ లోకం మొత్తం నిండిన గాలిలా ఉన్నది ఆనందం,
నన్ను ఆది చేరుతుంది అని అనుకుంటే అది అనర్ధం,
ఇది ఒక విచిత్రమైన లోకం..
నా అక్కున చేరని ఆనందాలు,నా అలసట తీర్చాని అవకాశాల నడుమ నేను...
ఒక క్షణం నాకు బ్రతకటం రాదని నన్ను తిట్టుకుంటూ..
మారు క్షణం లోకం సరి కాదు అని లోకాన్ని తిడుతూ..
ఎన్నాళ్లు ఇలా బ్రతకాలి....
లోపం ఎవరిదో తెలుసుకునెంత జ్ఞానం నాకు లేదు..
పాపం నా బ్రతుకు అనుకునే మౌనం మాత్రమే నాకు ఉంది..
అంతే మరి నేను కేవలం ఒక మనిషిని......
4 comments:
Bappi, lines lo life kanipinchindi naaku ... Gr8 work :)
Excellent dude :)
Enhduku antha virtahi ga rasavu bappiiiii
ee kavam rasina kavya kartha oka pretham(bro of bootam).... :P
Post a Comment